IDF: 800 ఎయిర్‌స్ట్రైక్స్.. 2000 మంది ఇరానీ సైనికులు మృతి
IDF : ఇరాన్‌పై సుమారు 800కి పైగా వైమానిక దాడులు చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. ఆ దాడుల వల్ల సుమారు రెండు వేల మంది ఇరానీ బలగాలు మృతిచెందినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. ఈ దాడుల కోసం సుమారు 16,000 పేలుడు పదార్ధాలను వాడారు. ఇరాన్ వార్‌లో 13 మంది అమెరికా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది.
జెరుసలాం : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడి చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ కదనరంగంలోకి దూకింది. ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా దాడులు కొనసాగించింది. ఇరాన్‌పై వార్ మొదలై నెల దాటింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ రక్షణ దళం(IDF) కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌పై గత నెల రోజుల నుంచి సుమారు 800కి పైగా దాడలు చేసినట్లు చెప్పింది. ఆ దాడుల వల్ల సుమారు రెండు వేల మంది ఇరానీ బలగాలు మృతిచెందినట్లు ఐడీఎఫ్ చెప్పింది. 800 వైమానిక దాడుల కోసం సుమారు 16,000 పేలుడు పదార్ధాలను వాడినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. ఆపరేషన్ రోరింగ్ లయన్ తో 2000 మంది ఇరానీ మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత సుమారు 4000 టార్గెట్లను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ వెల్లడించింది. ప్రాణాంతక రసాయన పదార్ధాలు ఉన్న ఇరానీ రీసర్చ్ , డెవలప్మెంట్ కేంద్రాన్ని తాజాగా ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. తౌఫిక్ దారు కంపెనీ ఫెంటానిల్‌ను ఎస్పీఎన్డీ సంస్థకు సరఫరా చేసేదని, దానితో రసాయనిక ఆయుధాలను డెవలప్ చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
למעלה מ-800 מטסי תקיפה ו-16,000 חימושים: נתוני צה”ל במבצע ‘שאגת הארי’ עד כאן
לכל הפרטים👇https://t.co/RKFZ3cTlhz pic.twitter.com/O4ipi5n2sv
— צבא ההגנה לישראל (@idfonline) April 1, 2026
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటన చేసింది. సెంట్రల్ కమాండ్ ప్రతినిధి నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఇరాన్ వార్‌లో సుమారు 348 మంది అమెరికా మిలిటరీ సిబ్బందికి గాయాలు అయినట్లు వెల్లడించారు. దీంట్లో 315 మంది మళ్లీ సర్వీసు డ్యూటీలో చేరినట్లు చెప్పారు. ఆరుగురు మాత్రం తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఇక ఇరాన్ ప్రతీకార దాడుల్లో సుమారు 13 మంది అమెరికా సిబ్బంది మరణించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పింది. మార్చి ఒకటో తేదీన కువైట్ పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని, ఆ దాడిలో 103వ సస్టేన్మెంట్ కమాండ్‌కు చెందిన ఆరుగురు సిబ్బంది మృతిచెందినట్లు చెప్పారు. ఇక మార్చి ఒకటో తేదీన సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఇరాన్ డ్రోన్ దాడిలో స్పేస్ ఫోర్స్‌కు చెందిన సర్జెంట్ మృతిచెందినట్లు తెలిపారు. ఇక కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ రీఫుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మార్చి 12వ తేదీన ఇరాక్‌లో కూలిందని, ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Airstrikes
- IDF
- Iran campaign
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

