న్యూఢిల్లీ: దుబాయ్ ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తుండగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయే ముందు ఏమయ్యిందో స్పష్టంగా తెలియజేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో పైలట్ నయాన్ష్ సయాల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో పైలట్ ఆఖరి క్షణాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. డబ్ల్యూఎల్ టాన్స్ ఏవియేషన్ వీడియోస్ పోస్ట్ చేసిన ఈ క్లిప్ సయాల్ చివరి క్షణంలో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ అతను కిందకు దూకడానికి అవసరమైన సయయం కానీ, ఎత్తు కానీ లేదు. ఈ లోగానే క్షణాల్లో జెట్ నేలను తాకి మంటల్లో చిక్కుకుంది.
యూట్యూబ్లో ఎయిర్ షోకు సంబంధించిన వీడియోలు వెతుకుతుండగా, తన కుమారుడు నడిపిన విమానం కూలిన సంగతి తనకు తెలిసిందని సయాల్ తండ్రి జగన్నాథ్ సయాల్ తెలిపారు. ‘నాన్నా.. ఎయిర్ షోలో నా ప్రదర్శన ఉంది. టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ చూడండి’ అని అంతకు ముందు రోజే తన కుమారుడు తనకు చెప్పాడని ఆయన రోదించారు.