Indira Eegalapati | హైదరాబాద్: హైదరాబాద్ యువతి ఇందిర (33) త్వరలో రియాద్ మెట్రో రైలును నడపబోతున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు గల ఈ ప్రాజెక్టు తుది దశలో ఉంది. ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయి. ఇందిర మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ప్రాజెక్టులో భాగస్వామినవడం తనకు గర్వకారణమన్నారు.
తాను ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, ధూళిపాళ గ్రామంలో జన్మించానని, 2006లో హైదరాబాద్‌లో స్థిరపడ్డానని చెప్పారు. తాను హైదరాబాద్ మెట్రోలో పని చేసేటపుడు రియాద్ మెట్రోకు దరఖాస్తు చేశానని తెలిపారు. రియాద్ మెట్రోలో ట్రైన్ పైలట్, స్టేషన్ ఆపరేషన్స్ మాస్టర్‌గా ఎంపికయ్యానని చెప్పారు.