హైదరాబాద్: జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ వస్తున్న లుఫ్తాన్సా విమానంలో సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం తిరిగి వెనక్కి మళ్లింది. అయితే సమస్య ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు. ఎల్‌హెచ్752 (బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్) విమానం ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరింది.
అయితే టేకాఫ్ అయిన కాసేపటి తర్వాత విమానం మళ్లీ వెనక్కి మళ్లినట్టు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 6 గంటలకు ఈ విమానం హైదరాబాద్ చేరుకోవాల్సి ఉన్నది.