న్యూఢిల్లీ : బుడాపెస్ట్‌కు చెందిన హంగరీ మహిళ సండ్రా (28) ఈ ఏడాది జనవరిలో రూ 60,600 వెచ్చించి కొనుగోలు చేసిన టాయ్ ప్లేన్‌తో ప్రేమలో పడింది. టాయ్ ప్లేన్ ఇప్పటివరకూ తాను మెచ్చిన అత్యంత మెరుగైన భాగస్వామని ఆమె చెబుతున్నారు. సండ్రా నిద్రించే సమయంలోనూ టాయ్ ప్లేన్ పక్కన ఉండాల్సిందే. టాయ్ ప్లేన్‌ను ముద్దాడి గుడ్ మార్నింగ్ చెప్పడంతో ఆమెకు రోజు ప్రారంభమవుతుండగా ఆ బొమ్మకు గుడ్ నైట్ చెప్పడంతో రోజు ముగుస్తుంది. తాను టాయ్ ప్లేన్‌ను ఎందుకు ప్రేమిస్తున్నానో తనకు తెలియదని దాన్ని అలా ప్రేమించేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
టాయ్ప్లేన్ తన సోల్‌మేట్ అంటోందామె. తనకు మూడేండ్ల వయసులోనే విమానాల పట్ల ఆకర్షణ మొదలైందని అన్నారు. పెద్దయ్యాక తాను విమానాల్లో పనిచేయాలనేది ఆమె కోరిక కాగా గత ఏడాదిలోనే సండ్రా విమానయాన పరిశ్రమలో ఉద్యోగం సాధించారు. ఆమె మాజీ బాయ్ఫ్రెండ్లు సైతం విమానాల పట్ల ఆమె ప్రేమకు అడ్డుచెప్పలేదు. గత ఏడాది మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిన తర్వాత వస్తువుతో సంబంధం పెట్టుకోవాలని ఆమె నిర్ణయించుకుంది.
తన జీవితంలో తొలిసారి టాయ్ ప్లేన్‌తో ప్రేమలో పడ్డానని, సగటు వ్యక్తి కంటే విమానాలనే తాను ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పారు. వీకెండ్స్‌లోనూ టాయ్ ప్లేన్‌ను తనతో తీసుకెళతానని, తాను తిరిగి మళ్లీ మనిషితో సంబంధానికి మొగ్గుచూపుతానని చెప్పలేనని సండ్రా అన్నారు. విమానాలు చాలా నమ్మదగిన భాగస్వాములన..తాను అతడితో (టాయ్ ప్లేన్) మాట్లాడతానని కూడా ఆమె చెప్పుకొచ్చారు.