న్యూయార్క్: నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్.. అంతరిక్ష అద్భుతాలను అందించింది. చాన్నాళ్లుగా రోదసీలోని అరుదైన నక్షత్రాల సమూహాన్ని చిత్రీకరిస్తున్న ఆ టెలిస్కోప్.. తాజాగా మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. సుమారు 2.8 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సోంబ్రిరో గెలాక్సీ(Sombrero Galaxy)కి చెందిన ఫోటోలను ఆ టెలిస్కోప్ రిలీజ్ చేసింది. విర్గో క్లస్టర్ గెలాక్సీకి దక్షిణ వైపున సోంబ్రిరో పాలపుంత ఉన్నట్లు నాసా వెల్లడించింది. నాసా తన ఇన్స్టాగ్రామ్లో సోంబ్రిరో గెలాక్సీకి చెందిన ఫోటోలను షేర్ చేసింది.
స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గెలాక్సీని ఇన్ఫ్రారెడ్ రంగుల్లో చూశారు. సోంబ్రిరో గెలాక్సీ మధ్యభాగంలో కృష్ణబిల్హం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సౌర వ్యవస్థలో ఉన్న బ్లాక్ హోల్ కన్నా అది వంద కోట్ల సైజులో పెద్దదిగా ఉన్నట్లు నాసా తెలిపింది. నాసా రిలీజ్ చేసిన సోంబ్రిరో గెలాక్సీలో చివరి భాగాలు కుడి, ఎడమ వైపున ఎరుపు రంగులో ఉన్నాయి. మధ్యలో ఉన్న రింగు భాగం ఎల్లో గ్రీన్ కలరలో ఉంది.
ఇక గెలాక్సీ సెంటర్లో ఉన్న భాగం లైట్ బ్లూ రంగులో ఉంది. ఆ గెలాక్సీ చుట్టు ఉన్న నక్షత్రాలు, పాలపుంతలన్నీ.. చుక్కల తరహాలో కనిపిస్తున్నట్లు నాసా తెలిపింది.