సౌదీ అరేబియాలోని జిడ్డా నగరంలో ఉన్న ఆయిల్ డిపోపై యెమెన్‌కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం దాడులకు పాల్పడ్డారు. దీంతో పెద్దయెత్తున మంటలు వ్యాపించాయి. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఫార్ములా వన్ రేస్ ఆదివారం జరుగనున్నది. కార్యక్రమానికి అవాంతరాలు సృష్టించడంలో భాగంగానే తిరుగుబాటుదారులు ఈ భయపెట్టే చర్యలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు.