వాషింగ్టన్ : అక్రమ వలసదారులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సోదాల గురించి మీడియాకు సమాచారం ఇస్తున్న వారిపై కఠిన చర్యలకు అమెరికా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తన సిబ్బందికి పాలిగ్రాఫ్ టెస్టులు చేస్తున్నది. డీహెచ్ఎస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, మూడు వారాల నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. డీహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టి నోయిమ్ మాట్లాడుతూ.. పట్టుబడినవారు 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉందన్నారు.