వాషింగ్టన్, సెప్టెంబర్ 26: అమెరికాలో హిందూ దేవాలయాలే లక్ష్యంగా విద్వేష మూకలు దాడులకు తెగబడుతున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో దుండగులు ఓ హిందూ ఆలయంలో చొరబడి విధ్వంసం సృష్టించారు. శాక్రమెంటోలోని ‘బీఏపీఎస్ హిందూ ఆలయం’పై రంగులు జల్లి, ఆలయం పవిత్రతను దెబ్బతీశారు.
‘హిందూస్ గో బ్యాక్’ అంటూ దేవాలయం గోడలపై పెయింటింగ్‌తో రాశారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని తెలిసింది. గత పది రోజుల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి.