టెక్సస్: రిపబ్లికన్ పార్టీ తరపున టెక్సస్ నుంచి సెనేట్‌కు పోటీ చేస్తున్న అలెగ్జాండర్ డంకన్ అమెరికాలోని టెక్సస్‌లో నిర్మించిన హనుమంతుడి విగ్రహంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.‘టెక్సస్‌లో బూటకపు హిందూ దేవుడి బూటకపు విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతిస్తున్నాం? మనది క్రైస్తవ దేశం’ అని డంకన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీంతో పాటు ‘నేను తప్ప మీకు మరో దేవుడు ఉండకూడదు’ అని బైబిల్లోని మాటలను పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల హిందూ అమెరికన్ ఫౌండేషన్, భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.