టైటానిక్.. 1997లో వచ్చిన ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా. దర్శక, నిర్మాత జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఆంగ్ల చిత్రం. ఈ సినిమాను టైటానిక్ నౌక ప్రమాద నేపథ్యంలో తీశారు. ఈ కథలో హీరో, హీరోయిన్ జాక్, రోజ్ వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి ప్రమాదం ద్వారా ఇద్దరూ ఎలా విడిపోయారన్నది ఈ చిత్ర కథాంశం. కాగా, ఈ చిత్రాన్ని 2022లో తీసి ఉంటే ఎలా ఉండేదో కళ్లకు కట్టిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.
ఈ కాలం యువత మొబైల్ఫోన్లు విడిచి ఉండడం లేదు. ఇదే అంశాన్ని తీసుకొని టైటానిక్ సినిమా 2022లో తీస్తే రోజ్ ఏమిచేసేదో చూపించారు. ఈ వీడియోలో జాక్ నీటిలో మునిగిపోతుంటే రోజ్ అతడి ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ కోసం జాక్ మళ్లీ పైకిరాగా, రోజ్ అతడి ఫింగర్ప్రింట్తో మొబైల్ ఓపెన్ చేసుకొని.. మళ్లీ నీటిలోకి తోసేస్తుంది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. చూసిన నెటిజన్లంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
The unreleased scene from Titanic!
Made me laugh a lot! 🤣🤣pic.twitter.com/v8rjYIWY97— Figen (@TheFigen) May 30, 2022