ధనిక దేశాల్లోనే ఎక్కువగా వ్యాక్సిన్ల వినియోగం: WHO
WHO on Covid-19 vaccine: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది. పేద, బీద అనే భేదం లేకుండా అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

జెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది. పేద, బీద అనే భేదం లేకుండా అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు తమ దగ్గరున్న మెరుగైన వైద్య సదుపాయాలతో మహమ్మారిని కొంతవరకు వేగంగా కట్టడి చేయగులుగుతున్నాయి. కానీ పేద దేశాలు మాత్రం ఈ వైరస్ను సరైన రీతిలో కట్టడి చేయలేక విలవిల్లాడుతున్నాయి.
పేద దేశాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వ్యాక్సిన్ల వినియోగంలో ధనిక దేశాలే ముందున్నాయి. స్వయంగా డబ్ల్యూహెచ్వో గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో ధనిక, ఎగువ మధ్యతరగతి దేశాల జనాభా 53 శాతం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లో 83 శాతాన్ని ఆ దేశాలే వినియోగించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
ఇక పేద, దిగువ మధ్యతరగతి దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 47 శాతం ఉందని, కానీ ఆయా దేశాల్లో వ్యాక్సిన్ వినియోగం కేవలం 17 శాతం మాత్రమే ఉన్నదని WHO వెల్లడించింది. ఈ మేరకు WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేస్ ఒక ప్రకటన చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దేశంలో ఇప్పటివరకు 30.56 కోట్ల కరోనా పరీక్షలు
కరోనా కల్లోలంలో బ్లాక్ ఫంగస్ బెడద
రోజువారీ కరోనా కేసుల్లో మహారాష్ట్రను వెనక్కి నెట్టిన కర్ణాటక
రెమ్డిసివిర్ కోసం కరోనా బాధిత కుటుంబాల అవస్థలు..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

