బీరుట్ : కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చాయి. బీరుట్ దహియే జిల్లాలోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం టార్గెట్‌గా ఆదివారం ఇజ్రాయెల్ మిలిటరీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.
పెద్ద శబ్దంతో మూడు పేలుళ్లు జరిగినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. కాగా, ఆదివారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై జరిపిన బాంబు దాడుల్లో ఇద్దరు చనిపోయారని, కనీసం 11 మంది తీవ్రంగా గాయపడ్డారని లెబనాన్ జాతీయ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.