వాషింగ్టన్: గ్రహాలు, నక్షత్రాల పుట్టుక, ఖగోళంలో మార్పులు వంటి విశ్వ రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా ఖగోళ టైమ్మెషీన్గా అభివర్ణిస్తున్న ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ)’ను నాసా శాస్త్రవేత్తలు శనివారం రోదసిలోకి పంపించనున్నారు. ఫ్రెంచ్ గయానాలోని ఈఎల్ఏ-2 లాంచ్‌ప్యాడ్ నుంచి ఏరియాన్ 5 రాకెట్ ద్వారా సాయంత్రం 5.50 గంటలకు జేడబ్ల్యూఎస్టీను ప్రయోగించనున్నారు. అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు టెలిస్కోపును రూపకల్పన చేశాయి. విశ్వం తొలినాళ్లల్లో ఏర్పడిన గెలాక్సీలను శోధించడం ఈ టెలిస్కోపు ప్రత్యేకత.