హోస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హూస్టన్ సిటీలో .. రేడియో టవర్‌ను ఓ హెలికాప్టర్(Helicopter Crash) ఢీకొన్నది. ఆ ఘటనలో ఆ హెలికాప్టర్లో ఉన్న నలుగురు మృతిచెందారు. సమీపంలో ఉన్న సెక్యూర్టీ కెమెరాలకు ఆ ప్రమాద దృశ్యాలు చిక్కాయి. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని స్థానికులు తమ వీడియోల్లో బంధించారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రైవేటు కంపెనీకి చెందిన ఆర్44 హెలికాప్టర్.. రేడియో స్టేషన్‌ను ఢీకొట్టింది. రేడియో టవర్ సమీపంలోనే గ్యాస్ ట్యాంక్‌తో పాటు రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఉన్నాయని, కానీ అదృష్టవశాత్తు భారీ ప్రమాదం జరగలేదని హూస్టన్ మేయర్ జాన్ విట్‌మైర్ తెలిపారు. రేడియో టవర్ కూలిన తర్వాత భారీ స్థాయిలో అక్కడ మంటలు వ్యాపించాయి. ఘటన పట్ల ఫెడరల్ ఏవియేషన్ శాఖ దర్యాప్తు చేపట్టింది.
WATCH: #Houston helicopter crash pic.twitter.com/onXKtq6Z1T
— UpToDate (@UpToDateNewsSvc) October 21, 2024