America | ఓక్లహామా సిటీ : అమెరికాలోని అనేక ప్రాంతాల్లో శనివారం పెను తుఫాన్ బీభత్సం సృష్టించింది. దాదాపు 16 మంది మరణించారు. ఇళ్లు, దుకాణాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. మిస్సోరీలో 10 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
ఆర్కాన్సాస్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, 29 మంది గాయపడ్డారు. టెక్సాస్లోని అమరిల్లోలో శుక్రవారం దుమ్ము చెలరేగడంతో ఓ కారు ఢీకొని ముగ్గురు మరణించారు. కెనడా నుంచి టెక్సాస్ వైపునకు గంటకు 130 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.