Dubai | ఎడారి దేశాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. భారత్-దుబాయ్ మధ్య నడిచే 28 విమానాలు రద్దు
Dubai | నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం దుబాయ్ (Dubai)ని భారీ వర్షాలు ముంచెత్తాయి (Heavy Rains). వర్షాల కారణంగా భారత్ - దుబాయ్ మధ్య నడిచే దాదాపు 28 విమానాలు రద్దయ్యాయి (28 India Flights Cancelled).
Dubai | నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం దుబాయ్ (Dubai)ని భారీ వర్షాలు ముంచెత్తాయి (Heavy Rains). మంగళవారం ఒక్కసారిగా బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన జడివాన కురిసింది. భారీ వర్షంతో వరదలు సంభవించాయి. దీంతో దుబాయ్ మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Dubai Airport) సైతం వరద ముంచెత్తింది. రన్‌వేపై మోకాళ్లలోతులో నీరు ఉండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దుబాయ్‌కు వచ్చే పలు విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తున్నారు.
ఇక వర్షాల కారణంగా భారత్ – దుబాయ్ మధ్య నడిచే దాదాపు 28 విమానాలు రద్దయ్యాయి (28 India Flights Cancelled). ఈ మేరకు సివిల్ ఏవియేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి దుబాయ్ వెళ్లే 15 విమానాలు, దుబాయ్ నుంచి భారత్‌కు రావాల్సిన 13 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్ట్‌లో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఎప్పుడు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడే దుబాయ్ ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయింది. ఇక్కడ ఏడాదిలో నమోదయ్యే వర్షపాతం.. 24గంటల్లోనే కురిసింది. గత 75ఏళ్లలో ఎన్నడూలేని విధంగా మంగళవారం జడివాన కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం నీట మునిగింది. రన్‌వేపైకి భారీగా నీరు వచ్చి చేరింది. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది.
Dubai Airport right now
pic.twitter.com/FX992PQvAU— Science girl (@gunsnrosesgirl3) April 16, 2024
Also Read..
Heavy Rains | ఎడారి దేశంలో భారీవాన.. జలమయమైన దుబాయి ఎయిర్పోర్ట్
Naveen Patnaik | హింజిలీతోపాటు మరోస్థానం నుంచి పోటీ.. నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

