Heavy Rains | ఎడారి దేశంలో భారీవాన.. జలమయమైన దుబాయి ఎయిర్పోర్ట్
Heavy Rains | ఎడారి దేశమైన దుబాయిలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Heavy Rains | ఎడారి దేశమైన దుబాయిలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎప్పుడు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడే దుబాయిలో ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయింది. ఇక్కడ ఏడాదిలో నమోదయ్యే వర్షాపాతం.. 24గంటల్లోనే కురిసింది.
Dubai Airport right now
pic.twitter.com/FX992PQvAU— Science girl (@gunsnrosesgirl3) April 16, 2024
గత 75ఏళ్లలో ఎన్నడూలేని విధంగా మంగళవారం జడివాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రద్దీ ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయి విమానాశ్రయం వర్షాలతో అనేక విమానాలను మళ్లించాల్సి వచ్చింది. దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో సాధారణంగా సాయంత్రం వంద విమానాలు తిరుగుతాయి. వాతావరణ మార్పుల కారణంగా విమానాలన్నింటిని మళ్లించారు.
భారీ వర్షాల కారణంగా విమాన కార్యకలాపాలు ఆలస్యంగా నడుస్తుండడంతో పాటు పలు విమానాలను రద్దు చేశారు. వర్షానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రన్‌వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారుల్లో నీరు నిలిచిపోయింది. షాపింగ్ మాల్స్‌లో సైతం మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది.
Current weather in Dubai pic.twitter.com/v6dqxaA97A
— CLEAN CAR CLUB (@TheCleanCarClub) April 16, 2024
దుబాయితో పాటు పొరుగు దేశం బహ్రెయిన్ కూడా వరదల్లో మునిగిపోయింది. వర్సాలకు 18 మంది మృత్యువాతపడ్డారు. వాస్తవానికి యూఈఏలో వర్షం కురవడం అరుదుగా జరుగుతుంది. శీతాకాలంలో మాత్రం పలు సందర్భాల్లో వర్షాలు కురుస్తాయి. గత 24గంటల్లో గంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురిశాయి. దుబాయిలో సగటు వార్షిక వర్షపాతం 100 మిల్లీమీటర్లు కాగా.. మంగళవారం సాయంత్రానికి దుబాయి 120 మిమీపైగా వర్షం కురిసింది. భారీ వర్షంతు దుబాయి నగరం అతలాకుతలమైంది. పాఠశాలలు మూతపడ్డాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

