క్లీవ్‌లాండ్: ఎరిథ్రిటాల్ కృత్రిమ స్వీట్నర్ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధనలో తేలింది. అమెరికా, యూరప్‌లోని 4 వేల మందిని అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.
రక్తంలో ఎరిథ్రిటాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారు గుండెపోటు, మరణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలో తేలింది. ఎరిథ్రిటాల్‌ను రక్తం లేదా ప్లేట్లెట్లలో కలిపి చూసినప్పుడు రక్తస్రావం ఆగి రక్తం గడ్డకట్టడాన్ని పరిశోధకులు గమనించారు. ప్లేట్లెట్లు సులువుగా చైతన్యవంతమై గడ్డకట్టేందుకు ఎరిథ్రిటాల్ తోడ్పడుతున్నట్టు వెల్లడించారు.