ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని అందించేందుకు ఫైజర్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను కెనడా ఆమోదించింది. కెనడా ఫెడరల్ హెల్త్ డిపార్ట్మెంట్ తన వెబ్సైట్లో ఆమోదించిన వ్యాక్సిన్ల సమాచారాన్ని అప్డేట్ చేసింది. ఆరు నెలల నుంచి నాలుగేండ్ల వయస్సు చిన్నారుల్లో కొవిడ్‌ను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొంది.
ఈ టీకాను చిన్నారులకు మూడు డోసుల్లో ఇవ్వనున్నారు. మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు. ఎనిమిది వారాల తర్వాత మూడో డోసు ఇస్తారు. ఈ ఏడాది జూలైలో ఐదేండ్ల లోపు పిల్లలకు మోడెర్నా కంపెనీ తయారుచేసిన స్పైక్‌వాక్స్ అనే టీకాను కెనడా ఆరోగ్య శాఖ ఆమోదించింది.