వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష హోదాను మరచి ఒక మహిళ పట్ల ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్ (69)ను ట్రంప్ నియమించారు. అయితే ఈ నియామకంపై ఆయన మాట్లాడుతూ బర్గమ్ భార్య అందంగా ఉందని, అందుకే ఆయనకీ పదవిని కట్టబెట్టినట్టు తెలిపారు.
ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో బర్గమ్, ఆయన భార్య అక్కడే ఉన్నారు. ‘బర్గమ్, అతని భార్య క్యాథరిన్ గుర్రపు స్వారీ వీడియోను చూశా. అందులో ఆమె చాలా ఆకర్షణీయంగా కన్పించారు. ముఖ్యంగా ఆ కారణంతోనే డగ్కు ఆ పదవి ఇచ్చా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.