London | లండన్: ఇంగ్లండ్‌లో ఓ యువకుడు అత్యంత దారుణ హత్యకు పాల్పడ్డాడు. లింకన్షైర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది మార్చి 24న ఈ హత్య జరిగింది. నేరాన్ని అంగీకరించిన నిందితుడు నికోలస్ మెట్సన్ (28)కు కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. హోలి బ్రామ్లి(26)ని నికోలస్ 2021లో వివాహం చేసుకున్నాడు. విడిపోయే దశలో ఉండగా.. ఆమెను కత్తితో పొడిచి చంపి శరీర భాగాల్ని 224 ముక్కలు చేసి.. ప్లాస్టిక్ బ్యాగులో వేసి ఇంట్లో కోల్డ్ స్టోరేజ్‌లో వారం పాటు ఉంచాడు. స్నేహితుడికి 50 డాలర్లు ఇచ్చి.. ఆ ప్లాస్టిక్ బ్యాగుల్ని విథమ్ నదిలో పడేయించాడు.