టెహ్రాన్, అక్టోబర్ 17: తమ దేశంలోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన అఫ్గానిస్థాన్‌కు చెందిన 250 మంది పౌరులను ఇరాన్ సరిహద్దు భద్రతా దళాలు గత వారం హతమార్చాయి.
పాకిస్థాన్ నుంచి అక్రమంగా ఇరాన్‌లోకి వీరు ప్రవేశించడానికి ప్రయత్నించగా ఈ ఊచకోత జరిగిందని, దీనిపై తాలిబన్ అధికారులు దృష్టి సారించినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తల్లోని నిజానిజాలను తమ దౌత్య వర్గాలు, ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబుల్‌లోని తాలిబన్ ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాట్ తెలిపారు. ఈ వార్తలను ఇరాన్ అధ్యక్షుడి ప్రతినిధి హసన్ కజేమి ఖొమి ఖండించారు.