Marco Rubio | యురేనియం అప్పగించాల్సిందే.. ఇరాన్‌కు స్పష్టం చేసిన మార్కో రుబియో
Marco Rubio : ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండటానికి ఎంతమాత్రం అంగీకరించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తమకు యురేనియం అప్పగించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.
Marco Rubio : ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండటానికి ఎంతమాత్రం అంగీకరించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తమకు యురేనియం అప్పగించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఇండియా పర్యటనలో ఉన్న మార్కో రుబియో.. ఇరాన్‌తో యుద్ధం, శాంతి చర్చలపై న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌తో చర్చల్లో పురోగతి ఉందని మార్కో రుబియో అన్నారు. త్వరలోనే ఇరాన్‌తో శాంతి చర్చలు కొలిక్కి వస్తాయని రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు.
శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ అప్పగించాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రపంచంలో చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి అందుబాటులో తెరిచే ఉంటుందని ఎలాంటి టోల్ ఉండదన్నారు. ఇరాన్ యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతంగా డీల్ చేస్తున్నారని రూబియో ప్రశంసించారు. రిపబ్లిక్ నేతలు ఇలాంటి పరిస్తితిని ద్వైపాక్షిక విధానంలో పరిష్కరిస్తారని చెప్పారు. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఇరాన్ యుద్ధం లాంటి సమస్యల్ని పరిష్కరించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని రుబియో వ్యాఖ్యానించారు. శాంతి మార్గం ద్వారా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
చమురు మార్కెట్లో ఇరాన్‌ను ఎప్పుడూ ప్రపంచంలో లీడర్‌గా ఎదగనీయబోమని రుబియో వెల్లడించారు. అమెరికా ఎనర్జీ ఉత్పత్తులు ఇండియాకు ఉపయోగపడతాయని చెప్పారు. అంతకుముందు ఇరాన్‌తో యుద్ధం, తాజా పరిస్థితులపై ప్రధాని మోదీతో రుబియో చర్చించారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ముగించాలని రుబియోకు మోదీ సూచించారు. ఇదే సమయంలో తాము అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ నేతలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ప్రధాని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

