న్యూయార్క్: గత అక్టోబర్ 7 నాటి దాడికి ముందు 9/11 తరహా దాడిని ఇజ్రాయెల్‌పై చేయాలని హమాస్ కుట్ర పన్నిన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కుట్రకు సంబంధించిన రికార్డులను హమాస్ కమాండ్ సెం టర్ నుంచి ఇజ్రాయెల్ దళాలు స్వా ధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇ రాన్ అధికారులతో హమాస్ నేత య హ్యా సిన్వార్ సంభాషణలను కూడా ఈ మేరకు గుర్తించారు. శనివారం న్యూయార్క్ టైమ్స్ పత్రిక పది సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ను పబ్లిష్ చేసింది.