Newyork Gun fire : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించారు. ఈసారి న్యూయార్క్ సిటీలోని రెస్టారెంట్లో కాల్పులకు తెగబడిన దుండగులు ముగ్గురిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గన్ ఫైర్ విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు గాయపడినవాళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం ఉదయం 3:30 గంటలు అవుతుండగా క్రౌన్ హైట్స్‌లోని ఫ్రాంక్లిన్ అవెన్యూలో ఉన్న టేస్ట్ ఆఫ్ సిటీ లాంజ్ అనే రెస్టారెంట్లోకి కొందరు తుపాకులతో చొరబడ్డారు. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా తూటాలతో విరుచుకుపడ్డారు. ఊహించని దాడితో భయభ్రాంతులకు లోనైన అక్కడివారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కానీ, ముగ్గురు చనిపోగా.. ఎనిమిదిమంది గాయపడ్డారు.
🚨 MASS SHOOTING: Crown Heights, Brooklyn
Gunfire erupted around 3:30 AM at Taste of the City Lounge on Franklin Ave.
•3 dead (all men)
•8 wounded
•NYPD confirms multiple suspects still at large
•903 Franklin Ave locked down under Level 1 MobilizationScene is swarming with… pic.twitter.com/A9iuXAWSvK
— Sarcasm Scoop (@sarcasm_scoop) August 17, 2025
‘రెస్టారెంట్ నుంచి 36 తుటాలను స్వాధీనం చేసుకున్నాం. దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు న్యూయార్క్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టాం. కాల్పుల ఘటనలో మరణించిన వాళ్లలో ఇద్దరి వయసు 27 ఏళ్లు, 35 ఏళ్లు ఉంటుంది. మూడో వ్యక్తి గురించిన సమాచారం తెలియాల్సి ఉంది’ అని పోలీస్ కమిషనర్ జెస్సికా థిస్చ్ తెలిపారు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఇంకా గుర్తించలేదని, అందుకే ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. టేస్ట్ ఆఫ్ సిటీ లాంజ్ రెస్టారెంట్‌ను 2022లో ప్రారంభించారు. అమెరికా, కరీబియన్ ఫుడ్‌కు ఇది ప్రత్యేకం. ఈ రెస్టారెంట్లో బార్, హుక్కా, లైవ్ డీజే ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహిస్తుంటారు.