Gun Culture : అమెరికాలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి
Gun Culture : తుపాకీ సంస్కృతి అగ్రరాజ్యంలో నానాటికి పెరిగిపోతున్నది. ఒక సంవత్సరంలో 2 కోట్ల తుపాకులు అమ్ముడయ్యాయంటే..

వాషింగ్టన్ : తుపాకీ సంస్కృతి (Gun Culture) అగ్రరాజ్యంలో నానాటికి పెరిగిపోతున్నది. ఒక సంవత్సరంలో 2 కోట్ల తుపాకులు అమ్ముడయ్యాయంటే ఎంత మేర తుపాకీ సంస్కృతి పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కొనుగోలుదారులు 40 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. కరోనా సమయంలోనే తుపాకుల అమ్మకాలు పెరుగడం గమనించాల్సిన విషయం.
అమెరికాలోని చాలా ప్రాంతాల్లోని ప్రజలు అశాంతి, ఒత్తిడిలో ఉంటున్నారు. ఎక్కువ శాతం మంది తమను మోసం చేసిన వారిపై కక్ష తీర్చుకోవడానికి తుపాకులను కొనుగోలు చేస్తున్నారు. యువతులు తమను తాము రక్షించుకోవడం కోసం తుపాకులను కొనుగోలు చేసుకుంటున్నారు. దీనితో పాటు తుపాకులను వేటాడటం కోసం కూడా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తమకు దక్కిన ఖాళీ సమయాన్ని వేటకు కేటాయిస్తున్నారంట. తుపాకుల అమ్మకాలు పెరుగుతున్నా.. క్యాట్రిడ్జ్‌లు, బుల్లెట్లు చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయని విక్రేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. దాంతో తుపాకీల ధరలు కూడా పెరుగుతున్నాయని అక్కడి వారంటున్నారు.
న్యూటౌన్‌లో ఉన్న నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ఆయుధాల రిటైలర్ల సర్వేలో గత ఏడాది కొనుగోలు చేసిన వారిలో 40 శాతం మంది మొదటిసారి తుపాకీ కొనుగోలుదారులు ఉన్నట్లు గుర్తించారు. కొత్త కొనుగోలుదారుల్లో కూడా 40 శాతం మంది మహిళలే ఉన్నారు. తుపాకీలు కొనడానికి ముందు చాలా మంది తుపాకులను వాడటంలో శిక్షణ పొందుతున్నారు. బుల్లెట్ల కొరత జాతీయ చట్టాన్ని అమలుచేసే ఫైర్ఆర్మస్ ట్రైనర్స్ అసోసియేషన్‌ను కూడా ప్రభావితం చేసింది. ‘చాలా మంది గన్ ట్రైనర్లు మా వద్ద వారి పేర్లను నమోదు చేయలేదు’ అని అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాసన్ వుస్టెన్బర్గ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
దేశం విడిచి వెళ్లండి: రష్యా దౌత్యవేత్తలకు అమెరికా ఆదేశం
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తొలిసారి ఇంట్లోకొచ్చిన కంప్యూటర్ టీఆర్ఎస్-80
దోమల జనాభా నియంత్రణ ద్వారా మలేరియాకు చెక్!
కరోనా వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌కు అడ్డుకట్ట
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

