వాషింగ్టన్, సెప్టెంబర్ 11: అమెరికాలో వలసదారులను నియంత్రించేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నది. ఆ దేశంలో ఉంటున్న విదేశీయులు, గ్రీన్కార్డుదారులపై బహిష్కరణ వేటు వేసేందుకు అవకాశం కల్పించే నూతన ఇమిగ్రేషన్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ తాజాగా ఆమోదించింది.
ఈ బిల్లులో పేర్కొన్న నిర్దేశిత నేరాల్లో విదేశీయులు ఒకవేళ దోషులుగా తేలితే, వారిని దేశం నుంచి ఉన్నపళంగా బహిష్కరిస్తారు. అమెరికాలోని విదేశీయులు, గ్రీన్కార్డుదారులు, శాశ్వత నివాస హోదా కలిగినవారు సహా వలసదారులందరికీ ఇది వర్తిస్తుంది.