న్యూయార్క్, ఆగస్టు 18: మీ స్నేహితుడి పెండ్లికి వెళ్లలేకపోతున్నారా? అతనికి ఆ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియడం లేదా? అయితే త్వరలో ఇలాంటి విషయాలపై గూగుల్ సలహా తీసుకొని ప్రొసీడ్ అవ్వొచ్చు. యూజర్ల జీవితానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌ను గూగుల్ అభివృద్ధి చేస్తున్నది.
21 అంశాలకు సంబంధించి యూజర్లకు సలహాలు, సూచనలు, ప్రణాళికలు, చిట్కాలు ఇచ్చేలా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇటువంటి చాట్‌బాట్ వల్ల ఉపయోగాల కంటే అనర్థాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌బాట్ సలహాల వల్ల ప్రమాదాలు, అనర్థాలు జరిగే ఆస్కారం ఉందని వారు చెబుతున్నారు.