Google Street View | టెక్ దిగ్గజం గూగుల్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. అర్జెంటీనాలో ఓ పోలీస్ అధికారి గోప్యతా హక్కు ఉల్లంఘించిన కేసులో భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. 2017లో సదరు పోలీస్ అధికారి ఇంటి నుంచి గూగుల్ స్ట్రీట్ వ్యూ కారు వెళ్లింది. ఆ సమయంలో అధికారి తన ప్రైవేట్ స్థలంలో ఉన్నాడు. స్థలానికి ఎత్తయిన గోడ సైతం ఉంది. ఆ స్థలంలో ఆయన నగ్నంగా ఉన్న సమయంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ కారు వెళ్లడంతో అందులో రికార్డయ్యింది. ఆ తర్వాత ఆయన తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. స్ట్రీట్ వ్యూలో నగ్నంగా ఉన్న చిత్రం స్పష్టంగా కనిపించింది. గూగుల్ సదరు చిత్రాన్ని బ్లర్ చేయకపోడం.. ఇంటి అడ్రస్, స్ట్రీట్ పేరు అన్నీ స్పష్టంగా కనిపించడంతో ఆయన గుర్తింపు బయటపడింది.
2019లో దాంతో సదరు అధికారి గూగుల్‌పై కేసు దాఖలు చేశాడు. దిగువ కోర్టు ఆ కేసును కొట్టివేసింది. దాంతో ఆయన అప్పీలేట్ కోర్టును ఆశ్రయించగా గోప్యతా హక్కును గూగుల్ ఉల్లంఘించదని పేర్కొంటూ కోర్టు గూగుల్‌కు 12,500 (భారతీయ కరెన్సీలో రూ.10.8లక్షలు) డాలర్ల పరిహారం సదరు వ్యక్తి చెల్లించాల్సి ఆదేశించింది. అయితే, విచారణ సమయంలో సదరు వ్యక్తి ప్రైవేట్ స్థలం గోడ ఎత్తు సరిపోదని.. ఇంకా పెంచాల్సిందని చేసిన వాదనలను తోసిపుచ్చింది. పబ్లిక్ ఏరియా నుంచి కాకుండా ప్రైవేట్ ఏరియా నుంచి తీశారని.. ఇది స్పష్టంగా ప్రైవసీని ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రకారం.. వ్యక్తుల ముఖాలు, వాహనాల నెంబర్ ప్లేట్లు ఆటోమేటిక్‌గా బ్లర్ అవుతుంటాయి. కానీ, సదరు అధికారి విషయంలో అలా జరుగకపోవడం గమనార్హం.