అమృత్సర్ : భారత్ ఇటీవల పాక్‌లోని తొమ్మది ఉగ్ర స్థావరాలపై దాడి చేసినప్పుడు దాయాది దేశం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి సోమవారం వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని తమ సైనికులు ముందుగానే అంచనా వేసి పాక్ డ్రోన్లు, క్షిపణులను కూల్చేశారని ఆయన తెలిపారు.
ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థ, ఎల్-70 వాయు రక్షణ తుపాకుల వంటి అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలను స్వర్ణ దేవాలయానికి రక్షణ కవచంగా మోహరించామని తెలిపారు.