లండన్: విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ (Bomb The Plane) ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. ఈజీజెట్కు (Easyjet flight) చెందిన విమానం లండన్లోని ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి స్కాట్లాండ్లోని గ్లాస్గో (Glasgow) వెళ్తున్నది. విమానం గాలిలో ఉండగా ప్రయాణికుల్లో నుంచి లేచిన 41 ఏండ్ల వ్యక్తి.. విమానంలో బాంబు పెట్టబోతున్నానని అరవడం ప్రారంభించాడు. డెత్ టూ అమెరికా, డెత్ టూ ట్రంప్ అంటూ నినాదాలు చేశాడు. అదిధంగా అల్లా హో అక్బర్ అంటూ పెద్ద పెట్టున అరుస్తున్నాడు.
అయితే అతడిని ఓ ప్రయాణికులు కింద పడేసి అదమి పట్టుకున్నారు. నిశ్శంబ్దంగా ఉండాలంటూ సూచించారు. అనంతరం విమానం గమ్యస్థానానికి చేరిన తర్వాత గ్లాస్గో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వెనక ఎవరైనా ఉన్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటర్ టెర్రరిజమ్ అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని వెల్లడించారు.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కాట్ల్యాండ్ పర్యటనలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈయూతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భాగంగా రెండు రోజుల క్రితమే స్కాట్ల్యాండ్ వచ్చారు. సుంకాల విషయమై ఈయూ చీఫ్ ఉర్సులా వాండర్ లెయెన్తో చర్చించనున్నారు. విమానంలో బెదిరింపుల విషయమై విమానయాన సంస్థ ఈజీజెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. విమానం, ప్రయాణికుల భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని తెలిపింది.
‘DEATH to Trump’ and ‘ALLAHU AKBAR’ — man causes panic on flight
Says he’s going to ‘BOMB the plane’
SLAMMED to ground by passenger pic.twitter.com/mVYwXqx7Yr
— RT (@RT_com) July 27, 2025