పర్టో లిండో, జనవరి 26: ఎటువంటి ఒత్తిడి లేకుండా సముద్రం అడుగున ఓ క్యాప్సూల్లో 120 రోజులు గడిపి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించాడు ఓ జర్మనీ ఏరోస్పేస్ ఇంజనీర్. అత్యధిక కాలం నీటి అడుగున ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవించిన వ్యక్తిగా 59 ఏండ్ల రుడిగర్ కోచ్ ప్రపంచ రికార్డును సాధించాడు.
సముద్రంలో మునిగిపోయిన ఓ 320 చదరపు అడుగుల క్యాప్సూల్నే ఇల్లుగా మలచుకుని 120 రోజులు అందులో గడిపిన కోచ్ శుక్రవారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి సుసానా రేయెస్ సమక్షంలో సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసంగా బయటకు వచ్చాడు.