Gaza War: 103 మంది ఆత్మీయుల్ని కోల్పోయిన వ్యక్తి.. గాజా వార్‌లో గుండెను పిండే ఘటన
Gaza War: గాజా వార్‌లో వేలాది మంది జీవితాలు కనుమరుగయ్యాయి. కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. హమాస్ జరిపిన దాడి తర్వాత జరిగిన ప్రతిదాడిలో ఓ వ్యక్తి కుటుంబానికి చెందిన 103 మంది ప్రాణాలుకోల్పోయారు.
టెల్ అవివ్: గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయిల్‌పై భీకర దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ అటాక్‌లో వందల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ దాడి సమయంలో అహ్మద్ అల్ గుఫేరీ అనే వ్యక్తి టెల్ అవివ్‌లో నిర్మాణరంగంలో పనిచేస్తున్నాడు. దాడుల వల్ల అతను ఇంటికి వెళ్లలేకపోయాడు. అయితే గాజా(Gaza) సిటీపై డిసెంబర్ 8వ తేదీన జరిగిన అటాక్‌లో తన ఫ్యామిలీని అతను కోల్పోయాడు. ఆ అటాక్‌లో సుమారు 103 మంది బంధువుల్ని కూడా అతను కోల్పోయినట్లు తెలుస్తోంది.
రోడ్లను మిలిటరీ మూసివేసిన తర్వాత అతను కేవలం తన ఫ్యామిలీతో ఫోన్లో మాత్రమే మాట్లాడేవాడు. తన భార్య షిరీన్‌కు ఫోన్ చేసేవాడు. కానీ డిసెంబర్ 8వ తేదీన జరిగిన దాడిలో తన భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలను కోల్పోయాడతను. ఆ బాంబు దాడిలోనే అహ్మద్ తల్లి, అతని నలుగురు సోదరులు, కుటుంబసభ్యులు కూడా చనిపోయారు. ఆ రోజు జరిగిన అటాక్‌లో అత్తలు, మామలు, సోదరులు.. మొత్తం సుమారు వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అహ్మద్ తెలిపారు. ఇంకా కొందరి మృతదేహాలు శిథిలాల కింద ఉన్నట్లు చెప్పాడు.
తొలుత ఓ మిస్సైల్ తమ ఇంటి గేటు వద్ద పడిందని, దాని నుంచి తప్పించుకున్న తన భార్యా పిల్లలు.. మామ ఇంటికి పరిగెత్తారని, కానీ 15 నిమిషాల తర్వాత ఓ ఫైటర్ జెట్ ఆ ఇంటిని పేల్చివేసిందన్నారు. దాడుల సమయంలో బయటకు పరుగెత్తిన వాళ్లు బ్రతికిపోయారని, ఇంట్లోనే దాచుకున్నవాళ్లు ఆ దాడిలో నేలమట్టం అయినట్లు ఓ ఫ్యామిలీ సభ్యుడు తెలిపాడు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఓ ఇంటిని టార్గెట్ చేస్తూ అటాక్ చేశారన్నాడు. గుఫేరి కుటుంబానికి చెందిన ఇండ్లపై జరిగిన దాడుల్లో 103 మంది మరణించినట్లు తేలింది.
అహ్మద్ అల్ గుఫేరీ ప్రస్తుత పరిస్థితి గుండెల్ని పిండేస్తోంది. తన ఫ్యామిలీ సభ్యుల్ని అతను కోల్పోయాడు. భర్త, పిల్లలు, తల్లి, అత్తమామ, సోదరులు అందర్నీ అటాక్‌లో చనిపోయారు. ఆ విషాద ఘటన నుంచి అహ్మద్ తేరుకున్నా.. అతని ఆవేదనను తీర్చేవారులేరు. నేటికి కూడా అక్కడ బాంబుల మోత మోగుతూనే ఉన్నది.
రాబోయే రంజాన్ మాసం సమయంలో.. యుద్ధం ఆగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ముస్లింల పవిత్ర మాసం సందర్భంగా ఆ రోజుల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. రంజాన్ వేళ ఎటువంటి ఆయుధాలు వాడరాదు అని ఇజ్రాయిల్‌తో ఒప్పందం కుదిరినట్లు బైడెన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- aerial strike
- Gaza man
- Hamas
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

