గాజా, ఆగస్టు 30 : ఇజ్రాయెల్, గాజా మధ్య గడచిన 22 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో మృతుల సంఖ్య 63,025 చేరుకుందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గాజా భూభాగంలో విధ్వంసం, దుర్భిక్షం విలయ తాండవం చేస్తుండగా, ఇజ్రాయెల్ గాజా నగరంలోకి చొరబడి దాడులకు తెగపడుతుండడంతో పాలస్తీనా పౌరుల మృతుల సంఖ్య 63 వేలు దాటింది.