Akshata Murty | భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు దేశాధినేతలు, ప్రధానులు ఇక్కడికి వచ్చారు. ఈ సదస్సు కోసం ఇండియాకు వచ్చిన నేతల్లో భారత మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ( Rishi Sunak) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రిషి భారత్కు చెందిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి కుమార్తె అక్షతా మూర్తి (Akshata Murty)ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని హోదాలో మొదటిసారి భారత్ పర్యటకు వచ్చిన రిషి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని మోదీ కూడా రిషిని ఆత్మీయంగా హత్తుకొని జీ20 సదస్సుకు ఆహ్వానించారు.
కాగా, ఢిల్లీలో ల్యాండ్ అయ్యేకి ముందు ఫ్లైట్లో రిషి-అక్షత మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటనకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో దిగే ముందు అక్షతా మూర్తి తన భర్త సునాక్ నెక్ టై (Neck Tie)ని సరిచేస్తూ కనిపించారు. ఈ ఫొటో ఇద్దరి మధ్య అన్యోన్యతను తెలిపేలా ఉంది. ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే రిషి సునాక్, అక్షతామూర్తి ఇద్దరూ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ ఫొటో కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భారత ఆడబిడ్డ అయిన అక్షతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read..
Mallikarjun Kharge | బీజేపీవి నీచ రాజకీయాలు.. జీ20 విందుపై ఖర్గే చిందులు
Morocco Earthquake | మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం.. 632కి పెరిగిన మృతుల సంఖ్య