Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు మరోసారి వాయిదా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు( Khamenei Funeral) మరోసారి వాయిదా పడ్డాయి.
హైదరాబాద్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు( Khamenei Funeral) మరోసారి వాయిదా పడ్డాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఖమేనీ అంత్యక్రియలను జూన్ చివరి వరకు లేదా జూలై ఆరంభం వరకు వాయిదా వేస్తున్నట్లు టెహ్రాన్ మేయర్ ప్రకటించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా కారణాలు,భద్రతా కారణాలు, మొహర్రం మాసంలో ప్రజల సంతాప కార్యక్రమాలు ఉన్నందున ఈ అంత్యక్రియలను జూన్ 26 జూలై 5 మధ్య కాలానికి వాయిదా వేస్తున్నట్లు టెహ్రాన్ మేయర్ అలీరెజా జకాని ప్రకటించారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన ‘ముహర్రం’ ప్రారంభంలో (జూన్ ఆరంభంలో) ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇరాన్ ఇంతకుముందు భావించింది. అయితే, కర్బలా యుద్ధంలో (క్రీ.శ. 680) అమరులైన ప్రముఖ షియా నాయకుడు ఇమామ్ హుస్సేన్ స్మారకార్థం భక్తులు జరిపే వార్షిక సంతాప కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు వీలుగా ముహర్రం మొదటి పది రోజుల తర్వాతే ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు మేయర్ అలీరేజా వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 2 కోట్ల (20 మిలియన్ల) మంది ప్రజలు హాజరవుతారని టెహ్రాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 37 ఏళ్లపాటు ఇస్లామిక్ రిపబ్లిక్కు నాయకత్వం వహించిన ఖమేనీ, ఫిబ్రవరి 28న మధ్య టెహ్రాన్‌లోని తన నివాసంలో మరణించారు. వాస్తవానికి మార్చి 4న జరగాల్సిన ఈ అధికారిక అంత్యక్రియల కార్యక్రమం, యుద్ధం కారణంగా వాయిదా పడింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

