Queen Elizabeth Death | బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 స్కాట్లాండ్లోని బాల్మోరల్ కాస్టిల్లో గురువారం మధ్యాహ్నం (స్థానిక కాల మానం ప్రకారం రాత్రి 11.21 గంటలకు) కన్నుమూశారు. గతేడాది అక్టోబర్ నుంచి సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వేసవి విశ్రాంతి కోసం స్కాట్లాండ్కు వెళ్లిన ఎలిజబెత్-2 పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె మరణానికి ముందు కఠినమైన ప్రొటోకాల్ పాటిస్తారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఎలిజబెత్-2 ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె వారసుడిగా భావిస్తున్న ప్రిన్స్ చార్లెస్, మనుమలు ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హర్రీ గురువారం స్కాట్లాండ్కు చేరుకున్నారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 వయస్సు 96 సంవత్సరాలు. బ్రిటన్ చరిత్రలో 25 ఏండ్ల వయస్సు నుంచి రాణిగా కొనసాగుతూ వచ్చారు. తొలుత ఎలిజబెత్-2 కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు వైద్యులు. అటుపై బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై బ్రిటన్ విదేశాంగ శాఖ కామన్వెల్త్ దేశాలకు తెలిపింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణించిన సంగతిని ప్రధాని లిజ్ ట్రస్ ధృవీకరించారు. ఆమె మృతి సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం 10 రోజుల సంతాప దినాలు ప్రకటించింది.