బ్రెసిలియా: చేతికి సంకెళ్లునప్పటికీ ఒక ఖైదీ కదులుతున్న పోలీస్ వ్యాన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ ఘటన వైరల్ అయ్యింది. బ్రెజిల్‌లోని పరైబాలో ఇది జరిగింది. గత ఏడాది డిసెంబర్ 28న అలగోవా నోవా పోలీసులు ఒక ఖైదీ చేతికి సంకెళ్లు వేసి పోలీస్ వ్యానులో స్టేషన్‌కు తరలిస్తున్నారు. అయితే అతడు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు. కదులుతున్న పోలీస్ వ్యాన్ వెనుకవైపు నుంచి రోడ్డుపైకి మెల్లగా దూకాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఖైదీ తప్పించుకున్న సంగతిని బ్రెజిల్ పోలీసులు చాలా సేపటి వరకు గుర్తించలేదు. పోలీస్ వ్యాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాతనే ఈ విషయాన్ని వారు గ్రహించారు. అయితే, ఆ ఖైదీ ఎలా తప్పించుకున్నాడు అన్నది వారికి అర్థం కాలేదు. దీనిపై సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. నాటి నుంచి కనిపించకుండా పోయిన ఆ ఖైదీ కోసం గాలిస్తున్నారు.
మరోవైపు పోలీస్ వ్యాన్ నుంచి ఖైదీ తప్పించుకున్న వైనం అక్కడి సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. నమ్మలేకపోతున్నానని ఒకరు, అతడి చేతికి నిజంగా సంకెళ్లు వేశారా అని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, పోలీసుల కళ్లగప్పి తప్పించుకున్న అతడు చాలా తెలివైన వాడంటూ కొందరు మెచ్చుకున్నారు.