గాజా: పాలస్తీనాలోని గాజాలో బంధించిన ఇజ్రాయెలీయులను రెడ్‌క్రాస్‌కు హమాస్ అప్పగించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మహిళ అర్బెల్ యెహౌద్‌ను వేలాది మంది పాలస్తీన్లు, ఆయుధాలు ధరించిన హమాస్ యోధులు చుట్టుముట్టారు. దీంతో ఆమె భయంతో వణికిపోయింది. (Terrified Israeli Hostage) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏడాదిన్నర కాలంగా యుద్ధం కొనసాగుతున్నది. ఒప్పందం మేరకు ఇరువురి చెరలో ఉన్న బందీల విడుదల కోసం జనవరి 19 నుంచి కాల్పుల విరమరణ అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఏడుగురు బందీలను హమాస్ గురువారం విడుదల చేసింది. 29 ఏళ్ల అర్బెల్ యెహౌద్ సహా ఇద్దరు ఇజ్రాయెలీయులు, ఐదుగురు థాయ్ జాతీయులను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది.
కాగా, హమాస్ మాజీ నాయకుడు యాహ్యా సిన్వర్ నివాస శిథిలాల నుంచి తరలించిన ఇజ్రాయెలీ మహిళ అర్బెల్ యెహౌద్‌ను వేలాది మంది పాలస్తీనియన్లు, హమాస్ సాయుధులు చుట్టుముట్టారు. దీంతో వారి మధ్య నుంచి భయంతో భయంతో వణుకుతూ అతి కష్టంగా రెడ్‌క్రాస్ వాహనం వద్దకు ఆమె చేరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనిపై స్పందించారు. ఇలాంటి బెదిరింపు దృశ్యాలు మళ్ళీ జరుగకుండా చూడాలని మధ్యవర్తులను కోరారు.
మరోవైపు గాజాలో ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసింది. వేలాది మందిని చంపడంతోపాటు వందలాది మందిని బందీలుగా తీసుకెళ్లారు. ప్రతీకారంగా నాటి నుంచి ఏడాదిన్నర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో వేల సంఖ్యలో పాలస్తీనా ప్రజలు మరణించారు. లక్షల్లో నిరాశ్రయులయ్యారు.
One WOMAN. Not a soldier. Just a JEWISH woman.
Arbel Yehud, alone, 481 days and nights in Hamas captivity.
A Jewish woman who’s name was never mentioned by ANY Women’s Rights org – and that includes @unwomenchief -,women’s magazines,celebrities, feminists. Zero, nada.… pic.twitter.com/O5St9sW0WH
— miha schwartzenberg (@mihaschw) January 30, 2025