మాస్కో: రష్యాలోని స్మోలెన్స్కీ ప్రాంతంలో గూడ్స్ రైలు ఓ ట్రక్కును ఢీకొనడం(Train crash)తో భారీగా మంటలు వ్యాపించాయి. బెలారస్ మార్గంలో ఉన్న రైల్వే లైన్లో.. స్మోలెన్స్కీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు క్రాసింగ్ వద్ద దుర్ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ యాక్సిడెంట్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. బహుశా అతను వార్నింగ్ లైట్లను పట్టించుకోలేదని భావిస్తున్నారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు వేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడ్స్ రైలు నడుపుతున్న రైటు ఇంజినీర్‌తో పాటు అసిస్టెంట్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. రైలుకు చెందిన 18 బోగీలు డిరేల్ అయ్యాయి. 16 బోగీలు కిందపడి నిప్పు అంటుకున్నాయి. 12 డబ్బాల్లో గ్యాస్ ఉంది. మరో నాలుగింటిలో కలప ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పేందుకు 10 అగ్నిమాపక ట్రక్కులను పంపినట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ పేర్కొన్నది.