పారిస్: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం లూవ్రాను దోచుకున్న దొంగలు అదే రోజు (అక్టోబర్ 19) ఫ్రాన్స్‌లోని మరో మ్యూజియంలో కూడా భారీ చోరీకి పాల్పడి 2,000 బంగారు, వెండి నాణేలను అపహరించారు. వీటి విలువ సుమారు రూ.91.45 లక్షలు అని అధికారులు వెల్లడించారు. లూవ్రా మ్యూజియంలో దోపిడీ జరిగిన కొన్ని గంటలకే ఇక్కడ చోరీ జరిగింది.
ప్రైవేట్ సేకరణలో భాగంగా 2011లో కనుగొన్న 1790-1840 కాలం నాటి నాణేలను ఇందులో భద్రపరిచారు. ఈశాన్య ఫ్రాన్స్‌లోని లాండ్రెస్లోని మైసన్ లూమియర్స్లో అక్టోబర్ 22న అధికారులు ఈ మ్యూజియం తెరచినప్పుడు 235 ఏండ్ల కాలం నాటి నాణేలు చోరీ అయినట్టు గుర్తించారు.