కొనాక్రి, నవంబర్ 4: గినియా మాజీ నియంత మౌస్సా డాడిస్ కెమెరా జైలు నుంచి తప్పించుకున్నారు. కొందరు సాయుధ ముష్కరులు శనివారం తెల్లవారుజామున దేశ రాజధాని కొనాక్రిలోని జైలుపై దాడి చేసి ఆయనను విడిపించుకుపోయారని గినియా న్యాయ శాఖ మంత్రి చార్లెస్ అల్ఫోన్స్ వెల్లడించారు.
మౌస్సాతోపాటు 2009లో ఓ స్టేడియంలో 157 మంది నర మేధానికి కారణమైన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు కూడా తప్పించుకొన్నవారిలో ఉన్నారని ఆయన చెప్పారు.