వాషింగ్టన్: మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీపై అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) మాజీ అధికారి రిచర్డ్ బర్లో సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్లోని కహుటలో ఉన్న అణ్వాయుధ కేంద్రంపై భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయాలన్న ప్రతిపాదన 1980వ దశకం తొలినాళ్లలో వచ్చిందని తెలిపారు.
ఈ ప్రతిపాదనను అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తిరస్కరించారని చెప్పారు. ఈ నిర్ణయం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. ఆ ప్రతిపాదన ప్రకారం దాడి జరిగి ఉంటే, అనేక సమస్యలు పరిష్కారమై ఉండేవన్నారు.