ఇస్తాంబుల్: టర్కీకి చెందిన రుమేసా గల్గీ (25) ప్రపంచంలోనే అతిపొడవైన (7 అడుగుల 0.7 అంగుళాలు ) మహిళ. ఆమె ఇటీవల టర్కిష్ ఎయిర్‌లైన్స్ సహకారంతో మొదటి విమాన ప్రయాణం చేశారు. ఆమె కోసం విమానంలో ఆరుసీట్లను తొలగించి, స్ట్రెచర్‌ను ఏర్పాటు చేశారు. తన స్వస్థలం ఇస్తాంబుల్ నుంచి యూఎస్‌లోని శాన్ఫ్రాన్సిస్కోకు ప్రయాణించారు. రుమేసా వీవర్ సిండ్రోమ్ వల్ల ఇంత పొడవు పెరిగారు.