విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
bomb threat | ఓ అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో జపాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఓ విమానం టోక్యోలోని నరిటా విమానాశ్రయం నుంచి ఫుకుయోకాకు వెళ్తోందని, ఈ విమానంలో బాంబు పెట్టినట్లు
bomb threat | ఓ అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో జపాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఓ విమానం టోక్యోలోని నరిటా విమానాశ్రయం నుంచి ఫుకుయోకాకు వెళ్తోందని, ఈ విమానంలో బాంబు పెట్టినట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత విమానాన్ని చుబు విమానాశ్రయానికి మళ్లించారు.
ఆ విమానంలో 136 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. జెట్‌స్టార్ విమానం కార్గో ప్రాంతంలో 100 కిలోల ప్లాస్టిక్ బాంబును అమర్చినట్లు ఒక వ్యక్తి జర్మనీ నుంచి ఉదయం 6:20 గంటలకు నరిటా విమానాశ్రయానికి టెలిఫోన్ కాల్ వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మేనేజర్‌తో మాట్లాడాలని కాల్ చేసిన వ్యక్తి కోరాడని, లేకపోతే బాంబు పేలుస్తానని హెచ్చరించినట్లు తెలిపాయి.
విమానం ల్యాండింగ్ తర్వాత తనిఖీలు నిర్వహించగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఎన్‌హెచ్‌కే తెలిపింది. ల్యాండింగ్ సమయంలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. బాంబు బెదిరింపు అనంతరం విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించిన దృశ్యాలను టీవీ ప్రసారం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

