వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీలపై అమెరికా అటాక్ చేసింది. బీ2 స్టీల్త్ బాంబర్ల(B-2 Stealth Bombers)తో దాడికి పాల్పడింది. బీ2 స్పిరిట్ బాంబర్.. స్టీల్త్ సామర్థ్యానికి పెట్టింది పేరు. హేవీ పేలోడ్‌ను కూడా ఆ బాంబు మోయగలదు. ఫైటర్ జెట్లతో పోలిస్తే.. ఆ బాంబర్ అధిక బరువు గల మందుగుండు సామాగ్రిని ఎక్కువ దూరం తీసుకెళ్లగలదు. అయితే యెమెన్‌లో హౌతీల ఆధీనంలో ఉన్న అయిదు సుదూర ప్రాంతాలపై అమెరికా బుధవారం అటాక్ చేసింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
The US attacked Houthi targets in Yemen tonight – for the first time using the B2 spirit stealth strategic bomber
Sources in Yemen report that around 4:00 am (Israel time) the US carried out 15 strikes in Yemen in the capital Sana’a region as well as in the northern Zada… pic.twitter.com/7wQY0UXe8z
— 🔯🇮🇱The Chosen 🇮🇱🔯 (@yatircohen) October 17, 2024
అంతర్ యుద్ధంలో సతమతంఅవుతున్న యెమెన్‌లో హౌతీ మిలిటెంట్ గ్రూపులు అనేక ప్రాంతాల్లో పాగా వేశారు. అయితే గత ఏడాది నవంబర్ నుంచి ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలను ఆ గ్రూపులు టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలను టార్గెట్ చేసేందుకు గత డిసెంబర్లో ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్‌ను అమెరికా స్టార్ట్ చేసింది.
తాజా దాడిలో బీ-2 స్పిరిట్ లాంగ్ రేంజ్ విమానాలను వాడినట్లు ఆస్టిన్ తన ప్రకటనలో చెప్పారు. అయిదు అండర్‌గ్రౌండ్ ఆయుధ నిల్వ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. టార్గెట్ ఎంత దూరం ఉన్నా.. ఎంత లోతుగా ఆయుధాల్ని దాచిపెట్టినా.. వాటినే టార్గెట్ చేయడమే తమ లక్ష్యమని ఆస్టిన్ చెప్పారు. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల ప్రకారం బీ2 బాంబర్లతో అటాక్ చేసినట్లు ఆయన తెలిపారు.