గాజా: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. నుసైరత్ ఏరియాలో ఆ దాడి జరిగింది. ఆ ఘటనలో అయిదుగురు జర్నలిస్టులు(journalists killed) మృతిచెందారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారిపై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. అల్ అవద్ ఆస్పత్రి గేట్ల వద్ద బాంబు దాడి జరిగింది. ఎరుపు రంగు అక్షరాలతో ప్రెస్ అని రాసి ఉన్న వాహనంపై అటాక్ జరిగింది. పాలస్తీనా ఛానల్ అల్ కుద్స్ టుడేకు చెందిన జర్నలిస్టులు ఆ వాహనంలో ఉన్నట్లు తెలిసింది. వాహనం పూర్తిగా ధ్వంసమైన ఫోటోను రిలీజ్ చేశారు. దానిపై ప్రెస్ అని రాసి ఉన్న ఆధారంగా ఆ వాహనంలో ఉన్నవారు జర్నలిస్టులని అంచనాకు వచ్చారు.