Justin Trudeau | ఒట్టావా, అక్టోబర్ 16: ఖల్థిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యపై భారత్కు కచ్చితమైన ఆధారాలు అందజేయలేదని అన్నారు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య సంస్థల్లో విదేశీ జోక్యంపై ఒట్టావాలో జరిగిన ప్రభుత్వ విచారణలో ప్రధాని ట్రూడో పై విషయాన్ని వెల్లడించారు.
కెనడా భూభాగంపై నిజ్జర్ హత్య.. భారత్ ఏజెంట్ల పనేనని గత ఏడాది ట్రూడో ఆరోపించారు. దీంతో కెనడా-భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. కేవలం నిఘా సమాచారం ఆధారంగా ఆ ఆరోపణలు చేసినట్టు నేడు ప్రభుత్వ విచారణలో చెప్పుకొచ్చారు.