First LNG terminal | తొలి తేలియాడే లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) టెర్మినల్ జర్మన్ చేరింది. తేలియాడే టెర్మినల్స్గా పనిచేసే నౌకల్లో ఇది మొదటిది. బుధవారం ముక్రాన్ బాల్టిక్ సముద్ర ఓడరేవుకు చేరుకున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో గ్యాస్ వనరులను పొందేందుకు జర్మనీ ఈ విధానానికి తెరలేపింది. చాలా కాలంగా రష్యా సరఫరాలపై ఆధారపడి ఉన్న జర్మనీ.. యుద్ధం కారణంగా ఎల్ఎన్జీ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.
280-మీటర్ల పొడవు గల నెప్ట్యూన్ లుబ్మిన్ సమీపంలో డిసెంబర్ 1న కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఫ్లోటింగ్ స్టోరేజీ, రీగ్యాసిఫికేషన్ యూనిట్లు ఉత్తర సముద్రపు విల్హెల్మ్షేవెన్, బ్రున్స్బ్యూటెల్ ఓడరేవులకు మరికొన్ని ఈ ఏడాదిలోనే చేరుకోనున్నాయి. మోత్బాల్డ్ బొగ్గు, ఆయిల్ఫైర్డ్ పవర్ ప్లాంట్లను పునరుద్ధరించడం, ప్రస్తుత శీతాకాలంలో మిగిలిన మూడు అణు రియాక్టర్ల జీవితకాలాన్ని పొడిగించడం వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఈ టెర్మినల్ ఎంతగానో ఉపయుక్తంగా ఉండనున్నది. వీటితో పాటు జర్మనీ ఇంధన భద్రతకు కూడా హామీగా ఉంటుందని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ చట్టసభ సభ్యులతో బుధవారం చెప్పారు.